వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్‌ కలెక్టర్‌

Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తి మృతి మంత్రి సభ ఏర్పాట్ల పరిశీలన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు కృషి

అనంతగిరి: హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ రాజు శుక్రవారం అన్ని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యా, పంచాయత్‌ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, భూసేకరణ తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్‌ ఘని, జెడ్పీ సీఈఓ సుధీర్‌, అడిషనల్‌ డీఆర్‌డీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

బంట్వారం: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన కోట్‌పల్లి మండలం రాంపూర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. ఎస్‌ఐ మీనాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగిల్‌ బాబు(50)వ్యవసాయం చేసేవాడు. ఇతని భార్య పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇతడొక్కడే గ్రామంలో ఉంటారు. రెండు రోజులుగా బాబు ఇంటి తలుపులు తెరవలేదు. దీంతో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అటుగా వెళ్లినప్పుడు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో భార్య వెంకటమ్మకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. వారు గ్రామానికి వచ్చి చూడగా బాబు చనిపోయి కనిపించాడు. బాబు మృతిపై ఎలాంటి అనుమానం లేదని పోలీసులకు తెలిపారు. తాగుడు అలవాటు ఉందని మద్యం సేవించి చనిపోయి ఉండవచ్చని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

షాద్‌నగర్‌: నందిగామ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు శనివారం ఉదయం 10 గంటలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా పాత జాతీయ రహదారి పక్కన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సభకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం షాద్‌నగర్‌ ఆర్డీఓ సరిత, ఏసీపీ లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు శివశంకర్‌గౌడ్‌, కొమ్ము కృష్ణ, వెంకటేశ్‌గౌడ్‌, కుమారస్వామిగౌడ్‌, జంగ నర్సింలు, చంద్రపాల్‌రెడ్డి, కావలి కృష్ణ, రఘు, బాబర్‌ఖాన్‌, కృష్ణగౌడ్‌, సీఐ వీరబాబు, తహసీల్దార్‌ సైదులు, డీటీ పావని తదితరులు పాల్గొన్నారు.

మొయినాబాద్‌రూరల్‌: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పాటుపడుతోందని తెలంగాణ ఎన్‌పీసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సువర్ణమహేంద్ర అన్నారు. మండల పరిధిలోని ఎత్‌మార్‌పల్లి సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ చేవెళ్ల బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం పాఠశాల ప్రిన్సిపాల్‌ మాలతి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. సువర్ణమహేంద్ర పాఠశాలను సందర్శించి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పాఠశాలలోని కిచెన్‌, గార్డెన్‌, గ్రంథాలయాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులను చక్కదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement