ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల కూల్చివేత

Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM

ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల కూల్చివేత జాతీయస్థాయి పోటీలకు ఎంపిక నేడు పూర్ణాహుతి

ఇబ్రహీంపట్నం రూరల్‌: రాందాస్‌పల్లి రెవెన్యూలో ప్రభుత్వ భూముల్లో వెలసిన ప్రహరీలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. శుక్రవారం ఉదయం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మాధవి, జీపీఓ సుదర్శన్‌ కలిసి సర్వే నంబర్‌ 86లో ప్రహరీలు, గేట్లను తొలగించారు. ప్రభుత్వ భూములతో పాటు పీఓటీ భూములు ఉన్నాయని అధికారులు గుర్తించారు. సర్వే నంబర్‌ 86 మొత్తం 49 ఎకరాల వరకు ఉంటుందని, ఎవరైనా అమ్మినా, కొన్నా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

షాద్‌నగర్‌రూరల్‌: మధ్యప్రదేశ్‌లో జాతీయస్థాయిలో నిర్వహించనున్న హార్డిల్స్‌ పోటీలకు షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన విద్యార్థి షేక్‌ మహ్మద్‌అష్రఫ్‌ ఎంపికయ్యాడు. పోటీల్లో అష్రఫ్‌ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. షాద్‌నగర్‌లో నిర్వహించిన అండర్‌–16 విభాగంలో, అండర్‌–17 విభాగంలో ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. జిల్లాస్థాయి పోటీల్లో రాణించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఖమ్మం జిల్లాలో ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి 100 మీటర్ల హార్డిల్స్‌లో బంగారుపతకం, 400 మీటర్ల హార్డిల్స్‌లో రజత పతకం సాధించాడు. వరుస విజయాలు సాధిస్తూ జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందాడు.

షాబాద్‌: శ్రీచండీ మహాయాగం పూర్ణాహుతికి అన్ని ఏర్పాట్లు చేశామని శ్రీజోషి విశాల్‌శర్మ, సర్పంచ్‌ పావని చెన్నయ్య తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. సీతారాంపూర్‌లోని శ్రీసీతారామకుటీరంలో అక్టోబర్‌ 24న ప్రారంభమైన చండీ మహాయాగం శనివారం నిర్వహించనున్న పూర్ణాహుతితో సమాప్తం కానుందని స్పష్టంచేశారు. లోకకల్యాణం, సకల జీవుల శాంతి, ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం ప్రధాన సంకల్పంగా ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. పూర్ణాహుతికి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, భక్తులు హాౖజరు కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement