కందుకూరు: ఎస్జీఎఫ్ (స్కూల్గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం అండర్–17 విభాగంలో జిల్లా స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారు. మొత్తం పది జోన్ల నుంచి బాలురు, బాలికల జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. మహేశ్వరం జోనల్ సెక్రటరీ మహ్మద్ అబ్దుల్లా క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని, విద్యార్థులు తప్పనిసరి క్రీడల్లో పాల్గొనాలని కోరారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. బాలికల విభాగంలో మొదటి బహుమతి హయత్నగర్ జట్టు, రెండో బహుమతి శంకర్పల్లి జట్టు, బాలుర విభాగంలో మొదటి బహుమతి ఇబ్రహీంపట్నం జట్టు, రెండో బహుమతి షాదనగర్ జట్టు కై వసం చేసుకున్నాయి. వారికి నిర్వాహకులు బహుతులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు రాజశేఖర్రెడ్డి, నిర్మల అప్టర్ యూనిషా, భీముడు, నీరజ, రాష్ట్ర పీఈటీలు, పీడీ అసోసియేషన్ బాధ్యులు సాబీర్, భాస్కర్, చంద్రమౌళి, ఉపాధ్యాయులు, జిల్లా క్రీడాధికారులు పాల్గొన్నారు.


