పట్టుదల ఉంటే విజయాలు వెన్నంటే | - | Sakshi
Sakshi News home page

పట్టుదల ఉంటే విజయాలు వెన్నంటే

Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM

షాద్‌నగర్‌రూరల్‌: ఏదైనా సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే విజయాలు వెన్నంటే ఉంటాయని గిరిజన గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి సీతాలక్ష్మి అన్నారు. పట్టణ సమీపంలోని నూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ‘చితరధార– గిరిజన ప్రాంతీయ కళల్లో సాంస్కృతిక వారసత్వం’ అంశంపై నాలుగు రోజులుగా విద్యార్థినులకు చిత్రకళా శిక్షణ శిబిరం నిర్వహించారు. శుక్రవారం ముగింపు కార్యక్రమానికి సీతాలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థినులు వేసిన నాయికపోడ్‌ పెయింటింగ్‌, గోండ్‌ పెయింటింగ్‌, సంప్రదాయ కళారూపాలపై ఏర్పాటు చేసిన చిత్రకళ శిక్షణ శిబిరాన్ని వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినులు విద్యతో పాటు అన్నిరంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. తమలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి ఇలాంటి కార్యక్రమాలు వేదికగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో గురుకుల డిగ్రీ కళాశాలల డిప్యూటీ సెక్రటరీ వేణుగోపాల్‌, ఓఎస్డీలు నీరజ, సతీష్‌గౌడ్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీతాపోలె, శిక్షకులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

గిరిజన గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి సీతాలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement