పరిశ్రమల వ్యర్థాలతో ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల వ్యర్థాలతో ఇబ్బందులు

Nov 6 2026 11:27 AM | Updated on Nov 6 2026 11:27 AM

● ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా

పట్టించుకోని అధికారులు

● కందివనం సర్పంచ్‌ జెమినిబాయి

అమృనాయక్‌, ఉప సర్పంచ్‌ విజయ

● బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో

విలేకరుల సమావేశం

కాచిగూడ: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఐరన్‌ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని, కాలుష్యం వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని బాధిత గ్రామాల రైతులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో కందివనం గ్రామ సర్పంచ్‌ జెమినిబాయి అమృనాయక్‌, ఉప సర్పంచ్‌ ఎం.విజయ, ఏశమోని కృష్ణయ్య, ఎల్‌.క్రిష్ణవర్ధన్‌ రెడ్డి తదితరులు మాట్లాడారు. కందివనం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఐరన్‌ పరిశ్రమ నుంచి కూడా కాలుష్యం వస్తోందని పేర్కొన్నారు. పరిశ్రమ నుంచి వెలువడే రసాయన వ్యర్థాలతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయని తెలిపారు. ఈనీటిని తాగి పశువులు, ఇతర మూగజీవాలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాయని, చెరువుల్లోని చేపలు మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంటల దిగుబడి తగ్గిపోవడమే కాకుండా, ప్రజలు శ్వాసకోశ, చర్మ వ్యాధుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. ఈ రెండు పరిశ్రమలను శాశ్వతంగా బంద్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement