షాద్‌నగర్: రోడ్డు ప్రమాదాల నివారణ అందరి భాద్యత అని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని షాద్‌నగర్ ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్ద వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రహదారులపై ప్రయాణించే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండటంతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు ఽతప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడిపించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి వాహనదారుడు విధిగా వాహనాలకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని, మైనర్లు వాహనదారులు నడపొద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకటేశం, ఏఎస్‌ఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు


