అనంతగిరి: వికారాబాద్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు. గురువారం పలు వార్డుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు, వాటర్ పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. ఎల్నినో నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కమిషనర్ విక్రం సింహారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సంక్షేమానికి పెద్దపీట
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య అన్నారు. గురువారం వికారాబాద్లో జరిగిన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్పర్సన్ అనన్య


