బొంరాస్పేట: రైతు మేళాకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. గురువారం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్లో రైతు మేళా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం మూడు రోజుల పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. వీవీఐపీ, వీఐపీ, అధికారులు, మీడియా, పార్కింగ్, భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలైన ఉద్యాన, పట్టు పరిశ్రమలు, పశుసంవర్ధక, మత్స్యశాఖలు ఏర్పాటు చేసే స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, జెడ్పీ సీఈఓ సుధీర్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


