తాండూరు: క్రీడలు, క్రీడాకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్‌తో కలిసి విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. అనంతరం ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీసీఎల్ –2026 టీఆర్‌ఎస్‌ఎంఏ క్రికెట్ లీడ్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలను సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు బంటు వేణుగోపాల్, టీఆర్‌ఎస్‌ఎంఏ తాండూరు అధ్యక్షుడు మోహన్‌కృష్ణగౌడ్, శ్రీకాంత్, సభాఫాతిమాహబీబ్‌లాల, పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజ్, నాయకులు ఉత్తమ్‌చంద్, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హామీలన్నీ అమలు చేస్తాం
తాండూరు రూరల్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఆరు నెలల్లో అమలు చేస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చెన్‌గేస్‌పూర్ గ్రామంలో హనుమాన్ ఆలయ నూతన కమిటీ చైర్మన్‌గా ఆర్ శ్రీనివాస్‌రెడ్డి, డైరక్టర్లుగా మమత, బంటు వెంకటయ్య, బాలసాగర్ గౌడ్, కాశప్పతో ఈఓ నరేందర ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిన చెన్‌గేస్‌పూర్, కోనాపూర్ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద చెన్‌గేస్‌పూర్‌కు 144 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. గ్రామ అభివృద్ధిని మరిన్ని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్‌నినో కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నందున ప్రజలు తాగునీటిని వృథా చేయరాదని, రైతులు వరి పంట వేయరాదని సూచించారు. బోర్ల వద్ద, చెరువు శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలన్నారు. జినుగుర్తి గ్రామ శివారులోని శ్రీరాములవారి ప్రాజెక్టుకు రూ.4 కోట్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీను, పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజ్‌కుమార్, గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు చందు, శ్రీశైలంగౌడ్, వెంకటేష్, రాజు గౌడ్, కిరణ్ గౌడ్, శ్రీనివాస్, భీంసేన్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్లతోనే అభివృద్ధికి బాటలు
బషీరాబాద్: రహదారుల నిర్మాణంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలో రూ.400 కోట్లతో రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. గురువారం మండలంలోని బోజ్యానాయక్‌తండాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్‌పర్సన్ కరుణ, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్‌రెడ్డి, ఏఎంసీ, సొసైటీ వైస్ చైర్మన్లు శంకరప్ప, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీవో సంపత్‌కుమార్, సర్పంచులు శాంతిభాయి, అనిత రాథోడ్, రమణి, బసప్ప, కార్యదర్శి శృతి, హౌసింగ్ ఏఈ అన్సారీ, కాంగ్రెస్ నాయకులు, తండావాసులు పాల్గొన్నారు.
విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
టీసీఎస్ –26 క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభం


