న్యాయ సేవలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

న్యాయ సేవలపై అవగాహన అవసరం

Nov 6 2026 11:21 AM | Updated on Nov 6 2026 11:21 AM

న్యాయ సేవలపై అవగాహన అవసరం రేపు వాహనాల పార్కింగ్‌కు వేలం రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని శివారెడ్డిపేట పీఏసీఎస్‌ చైర్మన్‌గా రాజశేఖర్‌రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ఆణిముత్యాలు

సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక

అనంతగిరి: ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక అన్నారు. గురువారం వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని బూరుగుపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయ సేవలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అమ్మాయిలు కష్టపడి చదువుకోవాలని ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయవాది రాము, ప్రిన్సిపల్‌ ఉషా కిరణ్‌, ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ధారూరు: ధారూరు క్రిస్టియన్‌ జాతర నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌కు ఈ నెల 7న స్టేషన్‌ధారూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేలం నిర్వహించనున్నట్లు జీపీ కార్యదర్శి అంజానాయక్‌ గురువారం తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.2 వేలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. వేలంలో పాల్గొనే వారు జీపీలో ఎలాంటి బకాయలు ఉండరాదన్నారు. ద్విచక్ర వాహనానికి రూ.50, ఫోర్‌ వీలర్‌కు రూ.100 వసూలు చేసుకునే వీలుందని ఆయన తెలిపారు.

కుల్కచర్ల: మండలంలోని మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని అంకిత రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 4న పరిగి పట్టణంలో జరిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. గురువారం అంకితను పాఠశాల ప్రిన్సిపాల్‌ జ్యోతిహెప్సిభా, పీఈటీ కృష్ణారెడ్డి సన్మానించారు. మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు.

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణ పరిధిలోని శివారెడ్డిపేట పీఏసీఎస్‌ చైర్మన్‌గా బిళ్లపాటి రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో 12 మంది సభ్యులుగా ఉండనున్నారు. ప్రస్తుతం రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో ఎన్‌ఎస్‌యూఈ అధ్యక్షుడిగా, వికారాబాద్‌ నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడిగా పనిచేశారు.

యాలాల: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని యాలాల సర్పంచ్‌ శివయ్య, సొసైటీ వైస్‌ చైర్మన్‌ బుర్నపురి నర్సింహులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో 70వ ఎస్‌జీఎఫ్‌ జిల్లాస్థాయి ఖోఖో పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ఆరు జోన్ల నుంచి అండర్‌ –14, –17 బాలబాలికలు పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. యాలాల మాజీ సర్పంచ్‌ దివంగత పేరి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం ఆయన తనయుడు పేరి రాజేందర్‌రెడ్డి పోటీలకు తోడ్పాటునందిచడం అభినందనీయమన్నారు. పోటీల్లో వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌, పెద్దేముల్‌, తాండూరు క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శోభారెడ్డి, హెచ్‌ఎం సిద్రామేశ్వర్‌, సొసైటీ డైరెక్టర్లు అహ్మద్‌, ఏఎంసీ డైరెక్టర్‌ నర్సింహులు, వార్డు సభ్యుడు ఉమేష్‌, ఏఏపీసీ చైర్మన్‌ మానస, పీడీలు రాజశేఖర్‌, కృష్ణయ్య, రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement