నాణ్యతకు తిలోదకాలు | - | Sakshi
Sakshi News home page

నాణ్యతకు తిలోదకాలు

Nov 6 2026 11:21 AM | Updated on Nov 6 2026 11:21 AM

పరిశీలిస్తాం

పరిగి: పట్టణంలోని కోర్టు నుంచి నంబర్‌ వన్‌ పాఠశాల వరకు చేపట్టిన మురుగు కాలువ నిర్మాణంలో నాణ్యత లోపిస్తోంది. పనులు దాదాపు పూర్తయినా క్యూరింగ్‌ చేయడం లేదు. దీంతో నిర్మాణం దెబ్బతింటోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పట్టణ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు కాగా పలు నిర్మాణాలు చేపట్టారు. ఇందులో భాగంగా మురుగు కాలువ నిర్మిస్తున్నారు. కాంక్రీట్‌ నిర్మాణంలో క్యూరింగ్‌ అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. క్యూరింగ్‌ చేస్తేనే పటిష్టంగా ఉంటుంది. లేకుంటే తక్కువ వ్యవధిలోనే పాడవుతుంది. ఈ విషయాన్ని కాంట్రాక్టర్‌ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఇష్టారాజ్యంగా మురుగు కాలువ నిర్మాణం

క్యూరింగ్‌ చేయని వైనం

అధికారుల పర్యవేక్షణ కరువు

పట్టణ పరిధిలో చేపట్టిన మురుగు కాలువను పరిశీలిస్తాం. పనులు పూర్తయిన తర్వాత పదిహేను రో జుల పాటు క్యూరింగ్‌ చేయాలి. లోపాలు ఉన్నట్లు తేలితే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం.

– కావటి మల్లేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, పరిగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement