పూడూరు: రైతులు సొసైటీల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం పూడూరు సొసైటీలో 21 మంది రైతులకు రూ.2.70 కోట్ల విలువైన దీర్ఘకాలిక రుణాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రూ.9 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందన్నారు. సబ్సిడీపై డ్రిప్పు, స్ప్రింక్లర్లు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పట్లోళ్ల రఘునాథ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ సురేందర్ ముదిరాజ్, సర్పంచ్ కిజర్ పాషా, సీఈఓ కాట్న మురళీధర్, పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
సొసైటీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి


