విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి | - | Sakshi
Sakshi News home page

విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

Nov 5 2026 8:50 AM | Updated on Nov 5 2026 8:50 AM

● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందరావు

● వికారాబాద్‌లో ఎస్‌ఐఆర్‌పై మేధావుల సమావేశం

అనంతగిరి: సజావుగా సాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రామచందర్‌ రావు పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్‌ పట్టణంలోని శివ కేశవ బ్యాంకేట్‌ హాల్‌లో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌ కుమార్‌ అధ్యక్షతన ఎస్‌ఐఆర్‌పై మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ మొదటిసారిది కాదన్నారు. సర్‌ ప్రక్రియ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభిషేక్‌ సింగ్వి తెలంగాణలో బోగస్‌ ఓట్లు ఉన్నట్లు చెప్పారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌ బోగస్‌ ఓట్లపై ఆధారపడుతోందని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత జరిగిన కేరళ ఎన్నికల్లోలో కాంగ్రెస్‌, అదేవిధంగా తమిళనాడులో విజయ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ఎందుకు మాట్లాడటం లేదని, వారు చర్చకు సిద్ధంగా లేరని తెలిపారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌పై తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. కాక్రోచ్‌ పార్టీ యువతను తప్పుదారి పట్టిస్తోందని, విదేశీ సంస్థలతో కలిసి దేశంలో అస్థిర పరిచే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, సుధాకర్‌ రావు, దిశా కమిటీ మెంబర్‌ వడ్ల నందు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కరణం ప్రహాల్లాదదరావు, మాధవ రెడ్డి, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, కౌన్సిలర్లు అనిల్‌ యాదవ్‌, రుచిత, స్రవంతి, లావణ్య, పార్టీ రాష్ట్ర నాయకులు శివరాజ్‌, వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement