● ప్రభుత్వ పథకాలను
సద్వినియోగం చేసుకోవాలి
● ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ మోహన్ నాయక్
పూడూరు: మండలంలోని మంచన్‌పల్లిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఖాతాదారులకు బ్యాంకింగ్, ఆర్థిక సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రీజినల్ మేనేజర్ మోహన్ నాయక్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ బ్యాంకింగ్, సామాజిక భద్రతా పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల ప్రయోజనాలను ఖాతాదారులకు వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రధానమంత్రి జనధన్ యోజన ఖాతాలు, ఆధార్ అనుసంధానం, రూపే డెబిట్ కార్డుల వినియోగం, కేవైసీ ప్రక్రియ, నామినీ నమోదు, ఆధార్ ఆధారిత చెల్లింపులు, నిక్షేపాల వివరాల సేకరణతో పాటు రైతులకు ఉపయోగపడే కిసాన్ క్రెడిట్ కార్డు పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ సీఏం ఎఫ్‌ఐ వెంకటేశ్వర్, ఎఫ్‌ఐ మేనేజర్ కృష్ణవేణి, ఎల్‌డీఎం డేవిడ్ విల్సన్, బ్రాంచ్ మేనేజర్ రోహిణి, ఎఫ్‌ఓఎస్ నవీన్ కుమార్, బ్యాంకు, ఆర్‌బీఐ సిబ్బంది సురేష్, ఉదయ్ కుమార్, రమేష్, జి.సురేష్ గౌడ్, పి.శ్రీకాంత్, ఎం.శ్రీకాంత్, సర్పంచ్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.


