● 13 చోరీల కేసుల్లో నిందితుడి అరెస్ట్
● 38 తులాల బంగారం,
70 తులాల వెండి స్వాధీనం
● 120కిపైగా చోరీలు చేసినట్లు
విచారణలో వెల్లడి
మైలార్‌దేవ్‌పల్లి: తాళం వేసి న ఇళ్లను లక్ష్యంగా చేసుకు ని చోరీలకు పాల్పడుతున్న దొంగను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పగటిపూట రెక్కీ నిర్వహిస్తూ అదను చూసి ఇళ్లలోకి చొరబడి విలువైన ఆభరణాలు, నగదును అపహరిస్తున్న నిందితుడి ఆటకు పోలీసులు చెక్ పెట్టారు. అతడి నుంచి 38 తులాల బంగారు ఆభరణాలు, 70 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. లక్ష్మీగూడకు చెందిన ఎం.శ్రావణ్‌కుమార్ అక్టోబర్ 19న భార్యతో కలిసి తన కిరాణా దుకాణానికి ఇంటికి తాళం వేసి వెళ్లారు. మధ్యాహ్నం వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో పాటు బెడ్‌రూమ్‌లోని బీరువాను కూడా దొంగలు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి వస్తువులు, నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం వాంబే కాలనీ క్రాస్ రోడ్స్ వద్ద ఎస్‌ఐ వేణుగోపాల్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై మైలార్‌దేవ్‌పల్లి నుంచి జల్‌పల్లి వైపు వెళ్తున్న దమ్మాయిగూడ సాయిబాబానగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హమీద్(48) పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు సయ్యద్ హమీద్‌ను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా లక్ష్మీగూడలో జరిగిన చోరీతో పాటు మరో 12 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. అంతేకాకుండా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గతంలో 120కిపైగా చోరీలకు పాల్పడినట్లు విచారణలో చెప్పినట్లు తెలిపారు. నాచారం, సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో అతడిపై పీడీ చట్టం నమోదైంది. నిందితుడి వద్ద నుంచి 38 తులాల బంగారు ఆభరణాలు, 70 తులాల వెండి వస్తువులను, యాక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


