‘బాపు కేసీఆర్‌’ పాట ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘బాపు కేసీఆర్‌’ పాట ఆవిష్కరణ

Nov 5 2026 8:44 AM | Updated on Nov 5 2026 8:44 AM

బంజారాహిల్స్‌: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం దాద్‌పల్లి వెంకటేశ్వర్ల తండాకు చెందిన యువ గాయని పాల్త పవనిక రూపొందించిన ‘బాపు కేసీఆర్‌’ పాటను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాటను రూపొందించిన గాయని పాల్త పవనికను కేటీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన కళాకారిణి తన ప్రతిభతో పాటను రూపొందించి, కేటీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ మాజీ కార్పొరేటర్‌ వెల్దండ వెంకటేష్‌, గ్రామ ప్రజాప్రతినిధులు హనుమంతు వెంకటేష్‌, అన్నంతో హనుమంతునాయక్‌, హాతిరామ్‌, అంజి, జగన్‌, లక్ష్మణ్‌, లక్‌పతి, సంతోష్‌, శ్రీను, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement