దౌల్తాబాద్: ఉపాధి కోసం ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లి అక్కడ చిక్కుకున్న ఓ మహిళకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఆమెను స్వదేశానికి రప్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫసల్‌వాద్ గ్రామానికి చెందిన టీ లక్ష్మి, వెంకటప్ప దంపతులు. కొన్నేళ్ల క్రితం భర్త వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోయాడు. వీరికి రాజు అనే కుమారుడు ఉన్నాడు. గతేడాది లక్ష్మి ఓ ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లి అక్కడ ఓ ఇంట్లో పనులు చేస్తోంది. ఏడాదిగా యజమాని జీతం ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని లక్ష్మి కుమారుడు రాజుకు ఫోన్ చేసి చెప్పింది. నెల రోజుల క్రితం రాజు మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని కలిసి తల్లి పడుతున్న బాధలను వివరించాడు. ఆయన బాధిత కుటుంబ సభ్యులను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లగా ఆయన మస్కట్‌లోని బీఆర్‌ఎస్ నాయకులతో మాట్లాడారు. లక్ష్మిని స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం ఉదయం బాధిత మహిళ విమానంలో మస్కట్ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. లక్ష్మిని ఎయిర్‌పోర్టులో మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్ కలిశారు. ఆమెను నేరుగా కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో లక్ష్మి కుటుంబసభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మస్కట్‌లో చిక్కుకున్న మహిళకు విముక్తి కల్పించిన మాజీ మంత్రి
హైదరాబాద్‌కు చేరుకున్న బాధితురాలు
కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబసభ్యులు


