హక్కుల సాధనకు సంఘటితమవుదాం | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకు సంఘటితమవుదాం

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

హక్కుల సాధనకు సంఘటితమవుదాం కార్యకర్తలకు అండగా ఉంటాం గుండెపోటుతో పాఠశాల సహాయకుడి మృతి ధారూరు – దోర్నాల్‌ మధ్య రాకపోకలు బంద్‌ తల్లీకూతుళ్ల అదృశ్యం

కుల్కచర్ల: హక్కుల సాధనకు గిరిజన ప్రజలందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు బాణవత్‌ హుస్సేన్‌ నాయక్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రానికి విచ్చేసిన ఆయనను సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు హక్కులు, రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బంజార సంఘం మండల నాయకులు మోహన్‌ నాయక్‌, శంకర్‌ నాయక్‌, శ్రీనివాస్‌, జంప్ల, హన్మంతు, లక్ష్మణ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప

కుల్కచర్ల: పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప అన్నారు. కొంత కాలంగా అనారోగ్య కారణంగా చికిత్స పొందుతున్న వెంకటేశ్‌ను మంగళవారం ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మైపాల్‌, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయకుమార్‌, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు కర్ణయ్య, మండల ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేష్‌, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు మహేశ్‌, ఎస్పీ మోర్చా మండల అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా నాయకులు శ్రీశైలం, లాలు, ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

దోమ: మండలంలోని దిర్సంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్న కె.యాదయ్య ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. ఇంటి వద్ద ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యాదయ్య మృతితో దిర్సంపల్లి ప్రభుత్వ పాఠశాలలో, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ధారూరు: మండల పరిధిలోని స్టేషన్‌ధారూరులో మూడో రైల్వే లైన్‌ పనుల కారణంగా ఈ నెల 5వ తేదీ వరకు తాండూరు వయా ధారూరు – దోర్నాల్‌ మధ్య రాకపోకలు ఆపేస్తున్నట్లు తహసీల్దార్‌ సాజిదాబేగం మంగళవారం తెలిపారు. ధారూరు – రుక్మాపూర్‌ రైల్వే స్టేషన్ల మధ్య గల దోర్నాల్‌ – ధారూరు రోడ్డు అండర్‌ బ్రిడ్జి మరమ్మతుల కారణంగా రాకపోకలు ఆపేస్తున్నట్లు వివరించారు. ధారూరు నుంచి పరిగి, తాండూరు, కొడంగల్‌ ప్రాంతాలకు వెళ్లేవారు, అలాగే ధారూరు మండలంలోని దోర్నాల్‌, అంపల్లి, గురుదోట్ల, నాగారం, కుమ్మర్‌పల్లి తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాలని సూచించారు. ఈ నెల 6 నుంచి తిరిగి రాకపోకలు ప్రారంభమవుతాయని తెలిపారు.

ఆమనగల్లు: మాడ్గుల మండల కేంద్రంలో వివాహ వేడుకకు హాజరైన ఓ వివాహిత కూతురుతో కలిసి అదృశ్యం కావడం కలకలం రేపింది. సీఐ వేణుగోపాల్‌రావ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు పట్టణానికి చెందిన గుగ్గిల్ల రామస్వామి భార్య సుమలత, ముగ్గురు పిల్లలతో కలిసి సోదరుడు సుందర్‌పాల్‌ కుమార్తె వివాహ వేడుక కోసం గత నెల 29న మాడ్గులకు వచ్చారు. వివాహం అనంతరం బంధువులకు, సుమలతకు చిన్నపాటి గొడవ జరగడంతో భర్త రామస్వామి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సుమలత ఈనెల 2న రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరు పిల్లలను ఇంటిదగ్గరే ఉంచి కూతురుతో పాటు వెళ్లిపోయింది. భర్త, బంధువులు కలిసి ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement