తాగునీటి సమస్య రావొద్దు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య రావొద్దు

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

అనంతగిరి: ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎనిమిది నెలలు గడ్డు కాలమని, కరువు పరిస్థితులు, పశుగ్రాసం, నీటి కొరత, విద్యుత్‌ సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి జిల్లా అధికారుల దృష్టికి తేవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు, ఫారంపాండ్స్‌, బోర్లకు మరమ్మతులు చేయించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సుధీర్‌, మిషన్‌ భగీరథ ఈఈ రవి, అడిషనల్‌ డీఆర్‌డీఏ సత్తయ్య, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.

ఎల్‌నినో నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement