తాండూరులో వర్షం | - | Sakshi
Sakshi News home page

తాండూరులో వర్షం

Oct 31 2026 11:03 PM | Updated on Oct 31 2026 11:03 PM

తాండూరు రూరల్‌: తాండూరు, పెద్దేముల్‌ మండలాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత వాన పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కంది, ఇతర పంటలకు జీవం పోసినట్లయ్యింది.

తాండూరు ఏడీఏగా

పూర్ణచందర్‌ రావు

తాండూరు రూరల్‌: పశు సంవర్ధక శాఖ తాండూరు డివిజన్‌ ఏడీఏగా డాక్టర్‌ పూర్ణచందర్‌ రావు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ సదానందం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌ నగరానికి బదిలీపై వెళ్లారు. దీంతో యాలాల మండల పశువైద్యాధికారి శివదుర్గాప్రసాద్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఇచ్చారు. తాజాగా వికారాబాద్‌ ఏడీఏ పూర్ణచందర్‌ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

భూగర్భ జలాలు

పెంచుకుందాం

జెడ్పీ డిప్యూటీ సీఈఓ హిరణ్మయి

ధారూరు: భూగర్భ జలాలు పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ హిరణ్మయి సూచించారు. శుక్రవారం మండలంలోని రుద్రారం, ధారూరు, నాగసమందర్‌ గ్రామాల్లో ఆమె పర్యటించారు. వీబీజీరామ్‌జీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇంకుడు గుంతల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్సింహులు, ఏపీఓ రాములు, ఈసీ రమేశ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

విజేతలకు ప్రశంసాపత్రాలు

అనంతగిరి: పోలీస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా నిర్వహించిన షార్ట్‌ ఫిల్మ్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్‌ అధికారులకు కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ స్నేహ మెహ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రథమ బహుమతిని యాలాల ఎస్‌ఐ విఠల్‌ రెడ్డి, ద్వితీయ బహుమతిని పెద్దేముల్‌ ఎస్‌ఐ ప్రశాంత్‌ వర్ధన్‌, తృతీయ బహుమతి నవాబ్‌పేట ఎస్‌ఐ గిరి అందుకున్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ సచిన్‌ బస్వరాజ్‌ గుట్టూర్‌, ఏఎస్పీ రాజేష్‌ మీనా తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్‌ నేతలు

అనంతగిరి: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన ధర్నాకు జిల్లా నాయకులు ప్రత్యేక బస్సులో బయలుదేరారు. ఇప్పటికే పలువురు నేతలు ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం వికారాబాద్‌, పరిగి, తాండూరు ప్రాంతాల నుంచి తరలివెళ్లారు.

ఏపీఎంపై బదిలీవేటు

ధారూరు: ధారూరు ఐకేపీ ఏపీఎం మంజులవాణిపై బదిలీవేటు పడింది. మహిళా సంఘాల సభ్యులకు ఇవ్వాల్సిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం క్లాత్‌ను కమీషన్‌ తీసుకొని ఒకరికే ఇవ్వడంపై సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలోని ఏడు క్లస్టర్లకు ఇవ్వాల్సిన క్లాత్‌ను ఒకరికే ఇచ్చారని మహిళలు ఆరోపించారు. సంఘాలకు పంపిణీ చేసిన కోడి పిల్లల విషయంపై కూడా ఫిర్యాదులు రావడంతో కలెక్టర్‌ ఆదేశంతో ఏపీడీ నర్సింహులు విచారణ జరిపారు. అక్రమాలు జరిగినట్లు తేలడంతో నవాబుపేటకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో నవాబుపేట ఏపీఎం దేవయ్యను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement