ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి కలెక్టర్ దీపక్ తివారి
అనంతరం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రోడ్డు భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, ఆర్‌అండీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, పీఆర్ ఈఈ ఉమేష్ కుమార్, డీపీఓ జయసుధ, వైద్యాధికారి చంద్రశేఖర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్, మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
ఎల్‌నినోను ఎదుర్కొందాం
కుల్కచర్ల: ఎల్‌నినో ఇబ్బందికర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొందామని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం మండలంలోని పీరంపల్లిలో వరి, కంది పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులను గ్రహించి ప్రభుత్వం 20 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిందన్నారు. రైతులకు సహాయ సౌకర్యాలు అందించేందుకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక కమిటీ నియమించడం జరుగుతుందన్నారు. రైతులు వరి స్థానంలో ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. పంటకు బదులుగా నీటి లభ్యతను భట్టి కూరగాయలు, పండ్ల తోటలను సాగుచేయాలని, అవసరమైనన్నీ స్పింగర్లు, డ్రిప్పులు అందించడం జరుగుతుందని పెర్కొన్నారు. ఎక్కడ కూడ ఇబ్బందులు తలెత్తకుండ అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పీరంపల్లి ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్డును పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుకు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. చిన్నారులతో అక్షరాలు రాయించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ఫారం పాండ్ పనులను చూశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, జిల్లా వ్యవసాయాధికారి కవిత, ఏడీ మధుసూదన్, అదనపు డీఆర్‌డీఓ సత్యయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఆంజనేయులు, తహసీల్దార్ పురుషోత్తం, ఎంపీఓ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, రైతుబంధు మాజీ అధ్యక్షుడు రాజు, సర్పంచులు వెంకటయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి


