రానున్న రెండేళ్లలో మండలరూపురేఖలు మారుస్తాం రహదారుల అభివృద్ధికి రూ.236 కోట్లు మౌలిక వసతులకు రూ.164 కోట్లు తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
బషీరాబాద్: రానున్న రెండేళ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టించి మండల రూపురేఖలు మారుస్తా మని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. మండల సమగ్ర అభివృద్ధికి మూడేళ్లలో రూ.400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి రూ.236 కోట్లు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు మరో రూ.164 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. శుక్రవా రం మండలంలోని రెడ్డిఘణాపూర్, మంతట్టి, నవల్గా గ్రామాల్లో రూ.32.94 కోట్లతో చేపట్టనున్న 25 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, భూగర్భ డ్రైనేజీ, అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ, మహిళా సంఘాల భవనాలు, సబ్ సెంటర్లు, ప్రహరీలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. 30 పడకల ఆస్పత్రి, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో మెరుగైన వైద్యం, పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి వస్తాయన్నారు. అగ్గనూర్ – బషీరాబాద్, బషీరాబాద్ – మైల్వార్, బషీరాబాద్ – కరణ్‌కోట్, బండమీదిపల్లి – మైల్వార్ ప్రధాన రహదారుల విస్తరణ పనులను ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. నవల్గా – రుద్రారం క్రాస్‌రోడ్డు రహదారి విస్తరణకు రూ.24.24 కోట్లు, మంతట్టి – జీవన్గీ – నారాయణపూర్ రహదారికి రూ.6.40 కోట్లు కేటాయించినట్లు వివరించారు. మండలంలో విద్యుత్ అంతరాయం నివారణకు రూ.3 కోట్లతో రెండు కొత్త 33 కేవీ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
నేతల్లో నయా జోష్
మండలంలో రెండు వర్గాలుగా ఉన్న నేతలు ఎమ్మెల్యే పర్యటనలో ఒక్కతాటిపైకి వచ్చారు. సీనియర్లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. కార్యక్రమంలో సొసైటీ చైర్‌పర్సన్ కరుణ, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్ మహరాజ్, సర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, ఏఎంసీ, సొసైటీ వైస్ చైర్మన్లు శంకరప్ప, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓ సంపత్‌కుమార్, తహసీల్దార్ షాహేదాబేగం, సర్పంచులు బసంత్, గిరిజ, వెంకటమ్మ, హరిత, ఏఈలు యశ్వంత్, వెంకట్, రిషికుమార్, కార్యదర్శులు గీత, అమృతప్ప, వెంకటయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాధవరెడ్డి, వెంకట్‌రామ్‌రెడ్డి, అజయ్‌ప్రసాద్, రాకేష్ మహరాజ్, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామునాయక్, రాజవర్ధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శాంతిభాయి, చందర్‌నాయక్, తలారి సురేష్, ఆల్తాఫ్, మాణిక్‌రావు, సంజయ్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


