పత్తి రైతుకు అన్యాయం చేస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు అన్యాయం చేస్తే ఊరుకోం

Oct 31 2026 11:03 PM | Updated on Oct 31 2026 11:03 PM

● నిబంధనల ప్రకారమే కొనుగోలు చేయాలి ● కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌ మధులత

తాండూరు రూరల్‌: పత్తి రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమని కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌ పర్సన్‌ మధులత, కార్యదర్శి సాయికుమార్‌ మిల్లు యజమానులను హెచ్చరించారు. శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో పత్తి రైతు కుదేలు అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి మార్కెట్‌ కమిటీ పాలకవర్గం, అధికారులు స్పందించింది. పెద్దేముల్‌ మండలం మారేపల్లి గేటు వద్ద ఉన్న సుమిత్ర పత్తి మిల్లును సందర్శించి రైతులు, యజమానితో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అనిత ఆదేశాలతో మిల్లును సందర్శించినట్లు చెప్పారు. రైతులకు అన్యాయం చేస్తే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో డైరక్టర్‌ హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement