ప్రత్యామ్నాయ పంటలు మేలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలు మేలు

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

హార్టికల్చర్‌ ఏడీఏ చంద్రశేఖర్‌

దౌల్తాబాద్‌: యాసంగి సీజన్‌లో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని హార్టికల్చర్‌ ఏడీఏ చంద్రశేఖర్‌ సూచించారు. బుధవారం దౌల్తాబాద్‌ రైతు వేదికలో ఉద్యాన, పట్టు పరిశ్రమ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవలేదని. రైతులు నీటి లభ్యత ఆధారంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. నీటి వనరులను కాపాడుకునేందుకు ఫాంపాండ్స్‌, ఇంకుడు గుంతలు, రీచార్జ్‌ పిట్‌ తవ్వుకోవాలన్నా రు. త్వరలో కొడంగల్‌లో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్ట రీ ఏర్పాటు కానున్నందున రైతులు ఆయిల్‌ పా మ్‌ సాగుపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, కూరరాజు రాంచందర్‌, రాములు, కేంద్ర స్కిల్‌ బోర్టు శాస్త్ర వేత్త తేజస్విని,ఉద్యాన శాఖ అధికారి సురేందర్‌నాథ్‌, హెచ్‌ఈఓ రాంరెడ్డి, సిబ్బంది మల్లికార్జున్‌, లక్ష్మణ్‌గౌడ్‌, నాయకులు వెంకట్రావు, వీరన్న, దస్తప్ప తదితరులు పాల్గొన్నారు.

ఓటరుగా నమోదు

చేసుకోండి

మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌

అనంతగిరి: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌ పట్టణంలోని సాయి డెంటల్‌ ఆస్పత్రి పీజీ విద్యార్థులకు నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

వీబీజీరామ్‌జీ పనులనుసద్వినియోగం చేసుకోవాలి

సామాజిక తనిఖీ రాష్ట్ర డైరక్టర్‌ నిర్మల

తాండూరు రూరల్‌: ఎల్‌నినో నేపథ్యంలో ప్రతి కూలీకి వీబీజీరామ్‌జీ పథకం పనులు కల్పించాలని సామాజిక తనిఖీ రాష్ట్ర డైరక్టర్‌ నిర్మల ఆదేశించారు. బుధవారం మండలంలోని అంతారంతండాలో సామాజిక తనిఖీ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక తనిఖీలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతి కూలీ జాబ్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్‌, స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌ ప్రదీప్‌కుమార్‌, ఏపీఏ నరోత్తంరెడ్డి, సర్పంచ్‌ రాంచంద్రర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొత్త మెనూ తయారు చేయాలి

అనంతగిరి: ప్రస్తుత రేట్ల ప్రకారం వసతి గృహాల్లో కొత్త మెనూను తయారు చేయాలని హాస్టల్‌ వార్డెన్ల సంఘం జిల్లా ప్రతినిధులు కోరారు. బుధవారం ఈ మేరకు వికారాబాద్‌లో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, కలెక్టర్‌ దీపక్‌ తివారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో డైట్‌ చార్జిలు పెంచడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే మెనూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ధరలు పెరిగినందున కొత్త మెనూను తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మత్‌ పాషా, హెచ్‌డబ్ల్యూఓ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు శుక్ల వర్ధన్‌రెడ్డి, కార్యదర్శి విజయ్‌కుమార్‌, టీఎన్‌జీవో కోశాధికారి రమేష్‌, ఉపాధ్యక్షుడు రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement