అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

యాలాల: అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రేషన్‌ కార్డులు, సన్నబియ్యం, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాలతో పేద ప్రజలకు దగ్గరవుతున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడనున్న నీటి ఎద్దడి అప్రమత్తత విషయంలో మంత్రి సీతక్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ను ఎమ్మెల్యే వీక్షించారు. రానున్న కాలంలో ఎల్‌నినో కారణంగా తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండనుందని, ఈ విషయంలో సర్పంచులు రీఛార్జ్‌ పిట్స్‌, నీటి వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. యాసంగిలో వరి పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గాయత్రి, సొసైటీ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, మాజీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌, మాజీ అధ్యక్షుడు భీమప్ప, సర్‌ నియోజకవర్గ కన్వీనర్‌ కరణం పురుషోత్తంరావు, సీనియర్‌ నాయకులు హన్మంతు, శ్రీధర్‌, మధుసూదన్‌రెడ్డి, పవన్‌కుమార్‌, ఖాసీం, రఘురాంరెడ్డి, కై లా రాఘవేందర్‌రెడ్డి, సోషల్‌ మీడియా ఇంచార్జీ గాజుల మన్నాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement