ఆరేళ్లుగా పిల్లర్ దశలోనే.. బిల్లులు రాక మధ్యలో ఆపేసిన కాంట్రాక్టర్లు ఇబ్బందుల్లో రైతులు, ప్రజలు
వికారాబాద్: కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం, చేపలు వంటి అన్ని రకాల నిత్యావసర ఉత్పత్తులను ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం సమీకృత మార్కెట్లకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో నిర్మించాలని నిర్ణయించింది. ఆరేళ్ల క్రితం స్థలాలు ఎంపిక చేసి టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. వికారాబాద్‌లో పిల్లర్ స్థాయిలో.. తాండూరులో పునాదుల స్థాయిలో.. పరిగి స్లాబ్ దశలో ఆగిపోయాయి. కొడంగల్‌లో పనులు ప్రారంభం కాలేదు. వికారాబాద్ పట్టణంలో రూ.6 కోట్లతో పనులు చేపట్టారు. సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలో పనులు ఆపేశాడు. ప్రస్తుతం కూరగాయలు విక్రయించేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వ్యాపారం సాగిస్తున్నారు.
జిల్లాలో అసంపూర్తిగా సమీకృత మార్కెట్ నిర్మాణాలు


