అభివృద్ధి కేంద్రంగా హకీంపేట | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి కేంద్రంగా హకీంపేట

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

● సీఎం ఆదేశాలతో జోరుగా పనులు

కొడంగల్‌: నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు జనం దృష్టిని ఆకర్శిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా హకీంపేట అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. మండలంని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట గ్రామాల్లో వందల కోట్ల రూపాయలతో వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. సమీప భవిష్యత్తులో ప్రజలకు ఏ అవసరం వచ్చినా హకీంపేట ఎడ్యూకేషన్‌ హబ్‌కు వచ్చేలా తీర్చిదిద్తుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పనులు చేయిస్తున్నారు. మెడికల్‌ కళాశాల, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, నర్సింగ్‌, పారా మెడికల్‌, ఫిజియోథెరపీ, మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్‌ కళాశాల, హాస్టల్‌ భవనాలు, సైనిక్‌ స్కూల్‌, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, ఫైర్‌ స్టేషన్‌, ఏటీసీ, స్కిల్‌ యూనివర్సిటీ, ఇలా ఒకటా రెండా అనేక రకాల భవనాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. హకీంపేట, లగచర్ల, పోలేపల్లితో పాటు పరిసర తండాల పరిధిలో సుమారు 1,300 ఎకరాల విస్తీర్ణలో ఎడ్యూకేషన్‌ హబ్‌, పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తున్నారు.

ప్రారంభానికి సిద్ధం

దుద్యాల మండలంలో పలు భవనాల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. దుద్యాల గ్రామ శివారులో రూ.8.5 కోట్లతో నిర్మించిన మండల సమీకృత భవనం, హకీంపేట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో రూ.4.6 కోట్లతో నిర్మించిన సమీకృత విద్యాలయాల భవన నిర్మాణం, దుద్యాల గేట్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కన నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణం పూర్తి కావచ్చింది. త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement