రేపటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

పరిగి: పట్టణంలో కొలువుదీరిన లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు ఎదిరే కృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు వేడుకలు జరగనున్నట్లు తెలిపారు. శనివారం ఉద యం 9గంటలకు వేదస్వస్తి యాగశాల ప్రవేశం, హోమం, బేరీ పూజాలు నిర్వహిస్తారు, ఆదివారం మూల మూర్తికి అభిషేకం, నిత్య హోమ కార్య క్రమా లు, సోమవారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

నేడు ఆలయ ప్రాకార

నిర్మాణానికి భూమిపూజ

కొడంగల్‌: పట్టణంలోని బాలాజీనగర్‌లో రూ.110 కోట్లతో చేపట్టిన శ్రీవారి ఆలయ నవీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. గ్రౌండ్‌ లెవల్‌ వరకు పనులను పూర్తి చేశారు. ఆలయ ప్రాకార నిర్మాణానికి నేడు భూమిపూజ చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ తిరుపతిరెడ్డి చేతుల మీదుగా ఉదయం 9.20 నుంచి 9.40 గంటల వరకు ప్రథమ శిలేష్టికాన్యాస కార్యక్రమం జరుగుతుందని మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌, ఆలయ ధర్మకర్తలు తెలిపారు.

భూ వివాదాలకు

శాశ్వత పరిష్కారం

కొడంగల్‌: మండల పరిధిలోని ఉడిమేశ్వరం, చిన్న నందిగామ, అంగడిరాయిచూర్‌, పర్సా పూర్‌, ఉప్పరిపల్లి గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రారంభించినట్లు తహసీల్దార్‌ రాంబాబు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి భూ కమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో వివాదాలు రాకుండా చూడటమే రీ సర్వే ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామ కంఠం, ప్రభుత్వ, పట్టా భూముల హద్దులు గుర్తించనున్నట్లు చెప్పారు. ఇందుకు రైతులు సహకరించాలని కోరారు.

రాజ్యాధికారంతోనే

బహుజనుల సంక్షేమం

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం

తాండూరు టౌన్‌: రాజ్యాధికారం చేజిక్కించుకోవడంతోనే బహుజనుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కట్టెల మల్లేశం, చేవెళ్ల పార్లమెంట్‌ ఇంచార్జి సయ్యద్‌ అమీర్‌ అన్నారు.గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో తాండూరు నియోజవర్గ స్థా యి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయ అధికారమే సమస్త సమస్యల పరిష్కారం అ న్నారు.అనంతరం బీఎస్పీ నియోజకవర్గ నూత న కమిటీని ఎన్నుకున్నారు. ఇంచార్జిగా నవీన్‌ యాదవ్‌, కృష్ణయ్య గౌడ్‌, అధ్యక్షుడిగా అనిల్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా ఎర్ర అనిల్‌, కార్యవర్గ సభ్యులుగా మల్లేశ్‌, బహుజన వలంటీర్స్‌ ఫోర్స్‌ కన్వీనర్‌గా ఎం శ్యామ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సమన్వయంతోపని చేయండి

అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌

అనంతగిరి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఇందుకోసం వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ సూచించారు. గురువారం ఆయన వికారాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వికలత్వ నిర్ధారణ కేంద్రం, క్యాన్సర్‌ వార్డును సందర్శించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆస్పత్ర సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శుభోత్‌ కుమార్‌, పీఆర్‌ ఈఈ ఉమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement