వీబీజీరామ్‌జీ పథకం కింద వెయ్యి నీటితొట్ల నిర్మాణం జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సదానందం
తాండూరు రూరల్: ఎల్‌నినోను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పశువుల తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సదానందం తెలిపారు. గురువారం తాండూరులోని ఏడీఏ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వీబీజీరామ్‌జీ పథకం కింద జిల్లాలో వెయ్యి పశువుల నీటితొట్ల నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో నిర్మాణానికి రూ.35 వేలు చెల్లించనున్నట్లు చెప్పారు. మరో 500 నీటి తొట్లకు మరమ్మతులు చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో వరి, జొన్న, కంది, మొక్క జొన్న పంటలు సాగు చేసినట్లు తెలిపారు. ఎల్‌నినో కారణంగా కేవలం 50 శాతం దిగుబడి మాత్రమే వచ్చిందన్నారు. ఇది పశుగ్రాసంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. చెరువులు, కుంటల్లో నీరు తగ్గి పశువుల తాగేనీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. రైతులు పొలంలో కొంత భూమిని పశుగ్రాసం సాగుకు కేటాయించాలని సూచించారు. త్వరలో ఎకరాకు పది కిలోల గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా సాగు ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.14 వేలు చెల్లిస్తుందని తెలిపారు. రైతులు భయాందోళనకు గురికారాదన్నారు. ఎవ రూ పశువులను అమ్ముకోరాదని సూచించారు.
మూగజీవాల తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ


