‘బీఎంఆర్‌’ సేవలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

‘బీఎంఆర్‌’ సేవలు అభినందనీయం

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

● స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ● 250 మంది అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేత

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికిస్టడీ మెటీరియల్‌ అందజేస్తున్న స్పీకర్‌

అనిల్‌కు చెక్కు అందజేస్తున్న ప్రసాద్‌కుమార్‌

తాండూరు: కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 70వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. తాండూరు పట్టణంలోని విలియం మూన్‌ స్కూల్‌లో బీఎంఆర్‌ ఫౌండేషల్‌ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు 40 రోజులుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. బుధవారం 250 మందికి ఫౌండేషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సమకూర్చిన స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్‌ తోపాటు స్టడీ మెటీరియల్‌ అందించడం అభినందనీయమన్నారు. అభ్యర్థులు కష్టపడి చదవి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థులు ఏకాగ్రతతో చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు థారాసింగ్‌ జాదవ్‌, బీఎంఆర్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

చదువుకు పేదరికం అడ్డుకారాదు

అనంతగిరి/మర్పల్లి: చదువుకు పేదరికం అడ్డుకారాదనే ఉద్దేశంతోనే తనవంతు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. బుధవారం వికారాబాద్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్పిల్లి మండలం పట్లూర్‌ గ్రామానికి చెందిన మెగులయ్య కుమారుడు అనిల్‌ ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువు కోసం రూ.లక్ష నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు రాములు యాదవ్‌, పట్లూర్‌ ఎంపీటీసీ మాజీ సభ్యులు స్వప్న సురేష్‌, సోషల్‌ మీడియా రాష్ట్ర కో ఆర్డినేటర్‌ చామల రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement