చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Oct 28 2026 8:18 AM | Updated on Oct 28 2026 8:18 AM

తాండూరు టౌన్‌: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని తాండూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్డి గిరిజ తిరందాసు సూచించారు. మండల లీగల్‌ సర్వీస్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ నంబర్‌ వన్‌ పాఠశాలలో సురక్షిత్‌ బచ్చన్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలిసీ తెలియని వయసులో విద్యార్థులు నేరాలకు పాల్పడుతుంటారని, దీంతో వారి భవిష్యత్‌ అంధకారమవుతోందన్నారు. నేరాలు, వాటికి విధించే శిక్షలపై అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. బాలల హక్కులు, బాల్యవివాహాల నిర్మూలన, పోక్సో, విద్యా హక్కు చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. క్రమశిక్షణ, చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాండూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పాశం రవికుమార్‌, ప్యానల్‌ న్యాయవాదులు జిలాని, అరుణ, పరమేశ్వరి, మస్తాన్‌, దేవ్‌రాజ్‌, పాఠశాల హెచ్‌ఎం గోపాల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తాండూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్డి గిరిజ తిరందాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement