వివాదానికి దారితీసిన ప్రహరీ కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

వివాదానికి దారితీసిన ప్రహరీ కూల్చివేత

Oct 27 2026 8:28 AM | Updated on Oct 27 2026 8:28 AM

వృత్తి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

తుర్కయంజాల్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మన్నెగూడ రెవెన్యూ సర్వే నంబర్‌ 40, 41లోని భూమిలో ప్రహరీ కూల్చివేత వివాదానికి దారితీసింది. ఇరువర్గాల వారు సోమవారం అక్కడికి చేరుకోవడం ఉద్రిక్తతకు కారణమైంది. దీనిపై ప్రముఖ్‌ టౌన్‌షిప్‌ కాలనీ వాసులతో పాటు, జీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్వాహకులు ఒకరిపై మరొకరు ఆదిభట్ల పోలీసులకు ఫిర్యా దు చేసుకున్నారు. విచారణ అనంతరం చర్య లు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

గంజాయి పట్టివేత

అబ్దుల్లాపూర్‌మెట్‌ : గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న ఇద్దరిని అదపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 168 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల కేంద్రంలోని బాలాజీ దాబా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడాన్ని గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు హయత్‌నగర్‌ శారదానగర్‌కు చెందిన మణికంఠ, అబ్దుల్లాపూర్‌మెట్‌ బీసీకాలనీకి చెందిన ప్రతాప్‌గా తేలింది. వారి నుంచి 168 గ్రాముల గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: వృత్తి నైపుణ్య శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అఽధికారి ఎస్‌.స్వర్ణలత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. శంషాబాద్‌ మినీ స్టేయంలో నిర్వహిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతీయువకులకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో తక్కువ ఫీజుతో శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 12 బ్యాచ్‌ల శిక్షణ విజయవంతంగా పూర్తయిందన్నారు. బ్యూటీషియన్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, టైలరింగ్‌, ఎంఎస్‌ ఆఫీస్‌ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

టీపీఎస్‌ పనుల్లో

వేగం పెంచండి

మంచాల: మండల కేంద్రంలో కొనసాగుతున్న టీపీఎస్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్మయి ఆదేశించారు. సోమవారం రాత్రి పాఠశాల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. నవంబర్‌లో సీఎం పర్యటన ఉన్నందున్న పనుల్లో వేగం పెంచాలన్నారు. అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి పనులు చకచకా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ ఎం.వీ.ప్రసాద్‌, నోడల్‌ అధికారి కిషన్‌ చౌహాన్‌, పాఠశాల ఇన్‌చార్జి వాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement