శంకర్‌పల్లి: రాబోయే విపత్తులను ముందే గుర్తించి, అందుకు తగ్గట్లు సన్నద్ధత కావాలని విద్యార్థులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని దొంతాన్‌పల్లిలో గల ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీలో సాక్ష్యం, గయా క్లబ్ మూడు రోజుల పాటు నిర్వహించిన వర్డే–2026 సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ సవాళ్లు అనేవి భౌగోళికంగా రాజకీయ పరిస్థితులను దాటి ఉంటాయని స్పష్టం చేశారు. వీటిని ప్రభుత్వాలు, పలు సంస్థలు, పౌరులు అధిగమించేందుకు నిరంతరం శ్రమించాలని కోరారు. కార్యక్రమంలో ఐఎఫ్‌హెచ్‌ఈ డైరెక్టర్ జనరల్ ప్రొ.డా.వి జయేందర్‌కుమార్, లా స్కూల్ అసిస్టెంట్ డీన్ ప్రొ.డా.అరుణ్‌కుమార్, కో–ఆర్డినేటర్లు హృదయ్‌తేజ్, డీవీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


