డీలర్ల ఎంపికలో అవకతవకలపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

డీలర్ల ఎంపికలో అవకతవకలపై ఫిర్యాదు

Oct 27 2026 8:28 AM | Updated on Oct 27 2026 8:28 AM

చేవెళ్ల: రేషన్‌ డీలర్ల నియామకంలో అవకతవకలు జరిగాయని, విచారణ చేసి న్యాయం చేయాలని చేవెళ్ల డివిజన్‌లోని నాలుగు మండలాలకు సంబంధించిన పలువురు అభ్యర్థులు కోరారు. సోమవా రం కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రజావాణిలో కలెక్టర్‌ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్ల డివిజన్‌లో ఇటీవల చేపట్టిన రేషన్‌ డీలర్ల ఎంపికలో అర్హులైన వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కులు, ఇంటర్వ్యూలో ఎంపికై న వారి వివరాలను నోటీస్‌ బోర్డులో పెట్టలేదన్నారు. మెరిట్‌ లిస్ట్‌ లేకుండానే ఎలా ఎంపిక చేశారో చెప్పాలని స్థానిక మండలాల్లో నిర్వహించిన ప్రజావాణిలలో, ఆర్టీఐ కింద కూడా దరఖాస్తులు చేసినా తమకు న్యాయం జరగటం లేదన్నారు. వివరాలు అడిగితే తప్పుడు సమాచారాలు అందించారని వాపోయారు. దీనిపై విచారణ చేసి తగున్యాయం చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్‌ సానుకులంగా స్పందించి తప్పకుండా విచారణ చేసి న్యాయం చేస్తామని తెలిపారన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో గుండాలకు చెందిన సౌజన్య, కౌకుంట్లకు చెందిన శ్రీనివాస్గౌడ్‌, కృష్ణగౌడ్‌, మహేందర్‌, చిన్నమంగళారంకు చెందిన సాయికుమార్‌, వెంకటాపూర్‌కు చెందిన గడ్డం ప్రభులింగం, సురేందర్‌, సురంగల్‌కు చెందిన మధుగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement