రేపు తాండూరుకు రానున్న స్పీకర్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు తాండూరుకు రానున్న స్పీకర్‌

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

రేపు తాండూరుకు రానున్న స్పీకర్‌ సాయం చేసిన చేతులకు చెక్కుల అందజేత ఓటరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నాం నేటినుంచి సామాజిక తనిఖీ వాల్మీకి బోధనలు మార్గదర్శకం

తాండూరు టౌన్‌: శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ బుధవారం తాండూరుకు రానున్నట్లు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డికి చెందిన బీఎమ్మార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల కోసం యువతకు ఉచితంగా అందిస్తున్న శిక్షణ శిబిరాన్ని స్పీకర్‌ సందర్శిస్తారని పేర్కొన్నారు. పట్టణంలోని విలియంమూన్‌ పాఠశాలలో కొనసాగుతున్న క్యాంపులో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌తో పాటు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్‌ అందజేస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.

అనంతగిరి: అనంతగిరి గుట్ట వద్ద ఈనెల 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడిన ఇద్దరు యువకులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందజేసింది. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి శ్రీధర్‌ బాబు ఆదేశాల కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ స్నేహమెహ్ర సోమవారం రియాజ్‌ఖాన్‌, మైతాఫ్‌కు రూ.25 వేల చొప్పున చెక్కులు అందజేశారు.

అనంతగిరి: అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వెంకటాచారి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 20,316 మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి తప్పులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ఆర్డీవో వాసుచంద్ర, సూపరింటెండెంట్‌ నేమత్‌ అలీ, తహసీల్దార్‌ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

తాండూరు రూరల్‌: మండలంలో వీబీజీ రామ్‌జీ కింద చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని వీబీజీ రామ్‌ జీ స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌ ప్రదీప్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో డీఆర్పీలతో సమావేశం నిర్వహించారు. మంగళవారం నుంచి మండలంలో 17వ విడత సామాజిక తనిఖీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రికార్డులను స్వాధీనం చేసుకున్నామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఈసీ మధుసూధన్‌రెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ అమీద్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: మహర్షి వాల్మీకి బోధనలు సమాజానికి మార్గదర్శకం అని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ కె.కిరణ్మయి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి జీవితం, ఆయన రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. వాల్మీకి బోధించిన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ, సమాజంలో ఐక్యత సోదరభావం, నైతిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కేశురాం, వాల్మీకి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement