యాలాల: భూ సమస్యలను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం యాలాల మండల కేంద్రంలో కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ఎంఆర్పీఎస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూ సమస్యలతో రైతులు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరం కాకపోవడంతో దీక్షలకు దిగాల్సి వచ్చిందన్నారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, ఎమ్మార్పీఎస్ నాయకులు డప్పు మహేందర్, కేవీపీఎస్ నాయకులు నర్సింహులు, లాలప్ప, అనిల్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంఘాల డిమాండ్
యాలాలలో రిలే దీక్షలు


