దోమ: ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోమ మండలం దిర్సంపల్లి అనుబంధ గ్రామమైన అనంతరెడ్డిపల్లి సమీపంలో అక్రమంగా మట్టి తవ్వి రోడ్డు పనులకు తరలిస్తున్నారనే ఫిర్యాదుతో రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మట్టి తవ్వేందుకు వినియోగిస్తున్న రెండు హిటాచీలు, తరలించేందుకు సిద్ధంగా ఉన్న నాలుగు టిప్పర్లను ఎస్‌ఐ వసంత్ జాదవ్ సీజ్ చేశారు. ఆదివారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాంచందర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దిర్సంపల్లి సమీపంలో కొంత కాలంగా ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అక్రమంగా తరలించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. మట్టి తరలిస్తున్న విషయం తెలుసుకొని దాడులు చేశారు. రెవెన్యూ ఇన్‌స్టెక్టర్ రాంచందర్‌రావు పోలీసులతో కలిసి దాడి చేసి నాలుగు టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రెవెన్యూ, పోలీస్ అధికారుల సంయుక్త దాడులు
నాలుగు టిప్పర్లు, రెండు హిటాచీలు సీజ్
కేసులు నమోదు


