గంట వ్యవధిలో పట్టబడ్డ దొంగ | - | Sakshi
Sakshi News home page

గంట వ్యవధిలో పట్టబడ్డ దొంగ

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

బంజారాహిల్స్‌: మద్యానికి అలవాటుపడ్డ ఓ ఆటోడ్రైవర్‌ తాను అద్దెకు తీసుకున్న ఆటోలోనే స్నాచింగ్‌లకు పాల్పడుతూ బంజారాహిల్స్‌ పోలీసులకు చిక్కాడు. నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. భోజగుట్టలో నివసించే గువ్వా శ్రీను (31) ఆటోను అద్దెకు తీసుకుని బతుకుతున్నాడు. మద్యానికి అలవాటుపడి ఈజీ మనీ కోసం దొంగతనాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–2లోని సాగర్‌ సొసైటీ ముగ్ధా భవన్‌ సెల్లార్‌లో అక్కడి సెక్యూరిటీగార్డ్‌ గోపాల్‌ కళ్లుగప్పి సెల్‌ఫోన్‌ దొంగిలించి ఉడాయించాడు. గంట వ్యవధిలోనే మళ్లీ బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని ఓ ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి యత్నించగా భవన యజమాని గుర్తించి 100కు డయల్‌ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అంతకముందే సెక్యూరిటీగార్డ్‌ సెల్‌ఫోన్‌ దొంగతనం చేసిన మిస్టరీ వీడింది. సెక్యూరిటీగార్డ్‌ సెల్‌ఫోన్‌ దొంగతనం చేసి మరో ఇంట్లో దొంగతనానికి పాల్పడేందుకు స్కెచ్‌ వేసి పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement