బంట్వారం: యాంటీ డ్రగ్స్ నినాదంతో ఏపీలో 1,036 కిలోమీటర్లు సైకిల్ యాత్ర పూర్తి చేసిన బంట్వారం మండలం తొర్మామిడి నివాసి మీరాసాబ్ జహీర్ పాషాకు లెజెండ్స్ అవార్డు దక్కింది. శనివారం హైదరాబాద్లోని బిర్లా ఆడిటోరియంలో తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్పర్సన్ తారిఖ్ అన్సారీ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ.. అవార్డు తన బాధ్యతను పెంచిందన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ, ఏపీలో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. యువతను మేల్కొల్పేందుకు, డ్రగ్స్ నివారణపై నిరంతర కృషి చేస్తానని స్పష్టంచేశారు.


