సమగ్ర భూసర్వేతో రైతులకు మేలు | - | Sakshi
Sakshi News home page

సమగ్ర భూసర్వేతో రైతులకు మేలు

Oct 24 2026 9:50 AM | Updated on Oct 24 2026 9:50 AM

● భూసర్వే ఏడీ మధుసూదన్‌ రావు

కుల్కచర్ల: సమగ్ర భూసర్వేతో భవిష్యత్తులో భూ సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయని భూసర్వే ఏడీ మధుసూదన్‌ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని సాల్వీడులో గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర భూసర్వేతో భూముల హద్దులు గుర్తిస్తారని, క్రయ విక్రయాలు చేసే సమయంలో ఇది ఉపయోగ పడుతుందని తెలిపారు. రైతులకు రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకే ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టిందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌ నాయక్‌, సర్పంచ్‌ లక్ష్మమ్మ, ఉప సర్పంచ్‌ సంధ్యారాణి, దీప్లానాయక్‌ తండా సర్పంచ్‌ అంజలి, పీరంపల్లి సర్పంచ్‌ వెంకటయ్య, గిర్దవరి రవీందర్‌చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement