వేగంగా వెళ్తున్న కారు టాప్‌పై కూర్చొని.. | - | Sakshi
Sakshi News home page

వేగంగా వెళ్తున్న కారు టాప్‌పై కూర్చొని..

Oct 24 2026 9:50 AM | Updated on Oct 24 2026 9:50 AM

ఆకతాయిల హల్‌చల్‌

పరిగి: ట్రాఫిక్‌ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఆకతాయిలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గురువారం రాత్రి పరిగి పట్టణంలో ఓ వ్యక్తి వేగంగా వెళ్తున్న కారు టాప్‌పై కూర్చొని ప్రమాదకర విన్యాసాలు చేశాడు. ఈ వీడియో శుక్రవారం సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. పట్టణ పరిధిలోని బీజాపూర్‌ – హైదరాబాద్‌ జాతీయ రహదారిపై కొందరు వ్యక్తులు వేగంగా కారు నడిపారు. ఓ వ్యక్తి కారు టాప్‌పై కూర్చుని చల్‌చల్‌ చేశారు. తోటి వాహనదారులను భయాందోళనకు గురి చేశారు. ఇలాంటి వ్యక్తుల కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకరు కారు టాప్‌పై కూర్చొని మరో ముగ్గురు లోపల ఉన్నట్ల తెలిసింది. మద్యం మత్తులో కారు నడిపారని స్థానికులు ఆరోపించారు. ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఎస్‌ఐ మోహనకృష్ణను వివరణ కోరగా వాహనాన్ని గుర్తించామని కేసు నమోదు చేస్తామని తెలిపారు.

పరిగి పట్టణంలో ఘటన

ఆందోళనకు గురైన ప్రజలు, వాహనదారులు

కేసు నమోదు చేస్తామన్న ఎస్‌ఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement