ఆన్‌లైన్‌ రోడ్డు భద్రత పాఠాలకు ఆదరణ | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ రోడ్డు భద్రత పాఠాలకు ఆదరణ

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

ఇప్పటి వరకు 18,093 మంది కోర్సు పూర్తి

సాక్షి, సిటీబ్యూరో: వాహనదారుల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు రవాణాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ రోడ్డు భద్రత కోర్సుకు విశేష ఆదరణ లభిస్తోంది. మొదట కూకట్‌పల్లి రవాణా కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ప్రస్తుతం క్యూర్‌ పరిధిలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఈ కోర్సును విస్తరించారు. లెర్నర్స్‌ లైసెన్స్‌ తీసుకొని పర్మనెంట్‌ లైసెన్స్‌ కోసం ఎదురుచూసే వాళ్లు తప్పనిసరిగా ఆన్‌ లైన్‌ కోర్సును పూర్తి చేయాలి. ఈ మేరకు ఇప్పటి వరకు 21,606 మంది ఈ కోర్సు కోసం నమో దు చేసుకున్నారు. వీరిలో 18,098 మంది కోర్సు ను విజయవంతంగా పూర్తి చేసినట్లు రవాణా అధికారులు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో రోజుకు 1000 మంది ఈ కోర్సుకు హాజరవుతున్నారు.

అవగాహన తప్పనిసరి..

కొత్తగా స్టీరింగ్‌ పట్టుకొనే ప్రతి వ్యక్తికి రోడ్డు నిబంధనలు, రహదారి భద్రతపై స్పష్టమైన అవగాహన ఉండాలని, అలాంటి వారికే వాహనాలను నడిపేందుకు లైసెన్సును ఇవ్వాలని సుప్రీంకోర్టు నియమించిన రోడ్డు భద్రతా కమిటీ సూచించింది. ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రవాణాశాఖ రోడ్డు భద్రతా పాఠాలను తప్పనిసరి చేసింది. మోటారు వాహన నిబంధనల మేరకు ఆర్టీఏ కార్యాలయాల్లో నిర్వహించే లెర్నర్స్‌ పరీక్షలకు హాజరైనవారు తిరిగి శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే లోపు (ఎల్‌ఎల్‌ఆర్‌ తీసుకొన్న నెల నుంచి 6 నెలల వరకు) వీడియో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండున్నర గంటల నిడివి ఉండే వీడియో పాఠాల్లో డిఫెన్సివ్‌ డ్రైవింగ్‌పైనా అవగాహన కల్పిస్తారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్‌, సీటుబెల్ట్‌ ధరించకపోవడం, డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌నున్‌ఉపయోగించడం వంటి ప్రవర్తనల వల్ల తలెత్తే అనర్థాలను, ప్రమాదాల ముప్పును ఈ వీడియో పాఠాలు వివరిస్తాయని రవాణాశాఖ విజిలెన్స్‌ విభాగం జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement