షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌కు కొత్త హంగులు | - | Sakshi
Sakshi News home page

షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌కు కొత్త హంగులు

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

● రూ.3.96 కోట్లతో సుందరీకరణ పనులు

● పిల్లర్లు, క్రాష్‌బ్యారియర్లపై ఆర్టిస్టిక్‌ పెయింటింగ్‌లు

● మూడు నెలల్లో పనులు పూర్తి

సాక్షి, సిటీబ్యూరో: నగర సుందరీకరణకు ప్రాధాన్యమిస్తూ ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లను అందమైన రంగులు, కళాకృతులతో తీర్చిదిద్దిన జీహెచ్‌ఎంసీ తాజాగా షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌కు కొత్త హంగులద్దేందుకు సిద్ధమైంది. ఫ్లైఓవర్‌ పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు పిల్లర్లు, క్రాష్‌బ్యారియర్లపై కళాత్మక చిత్రాలు, రంగులతో ఆకట్టుకునే పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం రెండు విభాగాలుగా రూ. 3.96 కోట్లకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇప్పటికే పరిపాలన అనుమతులు జారీ చేయడంతో త్వరలోనే కాంట్రాక్టు ఏజెన్సీని ఖరారు చేసి పనులు చేపట్టనున్నారు. ఈ పనులు మూడునెలల్లో పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా..

ఫ్లైఓవర్‌ పిల్లర్లపై తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వం, ఆధునిక నగర జీవనశైలిని ప్రతిబింబించే కళాత్మక చిత్రాలను ఆవిష్కరించనున్నారు. అదే సమయంలో క్రాష్‌బ్యారియర్లను రంగురంగుల డిజైన్లతో అలంకరించి ఫ్లై ఓవర్‌ మొత్తానికి ప్రత్యేక అందాన్ని తీసుకురానున్నారు. ఇప్పటికే తీర్చిదిద్దిన పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు కళాత్మక పెయింటింగ్‌లతో ప్రత్యేక గుర్తింపు పొందిన నేపథ్యంలో షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ను కూడా అదే తరహాలో అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఈ పనులు పూర్తయిన తర్వాత షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ కేవలం ప్రయాణ మార్గంగా కాకుండా నగరంలో ఫొటోగ్రఫీ, విజువల్‌ ఆకర్షణకు కేంద్రంగా మారనుందని.. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతో పాటు నగర ప్రతిష్ట మరింత పెంచడమే ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన ఉద్దేశమని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement