రైలు ప్రయాణంలో ప్రైవేటు టీచర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణంలో ప్రైవేటు టీచర్‌ మృతి

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

రైలు ప్రయాణంలో ప్రైవేటు టీచర్‌ మృతి

సికింద్రాబాద్‌: రైలు ప్రయాణంలో తీవ్ర అసవస్థతకు గురైన ఒక ప్రైవేటు ఉపాధ్యాయురాలు గురువారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మృతి చెందింది. జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ కే.నాగేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు... విజవాడ దుర్గాపురానికి చెందిన వి.విశాలాక్షి (41) చందానగర్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. దసరా సెలవులకు స్వంత ఊరికి వెళ్లిన ఆమె తిరిగి నగరానికి వచ్చేందుకు బుధవారం రాత్రి విజయవాడలో మచిటీపట్నం–బీదర్‌ రైలు ఎక్కింది. లింగంపల్లి స్టేషన్‌లో దిగాల్సిన విశాలాక్షికి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు రైలు తెల్లవారు జామున చేరుకుంటున్న సమయంలో ఫిట్స్‌ వచ్చాయి. దీంతో బెర్త్‌లోనే ఆమె అపస్మారకస్థితికి చేరడంతో తోడి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. జీఆర్‌పీ పోలీసులు పరిశీలించగా.. అప్పటికే విశాలక్షి మృతి చెందినట్టు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement