కుల్కచర్ల: కారు బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి గాయపడ్డారు. ఈ ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామునిపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య బైక్‌పై పాత గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి పరిగి – మహబూబ్‌నగర్ రోడ్డుపైకి వెళ్తున్న క్రమంలో పరిగి నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కృష్ణయ్యకు కాలు విరిగింది. అతన్ని మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. కారును ఫొటో గ్రాఫర్ ఎండీ ఇస్మాయిల్ నడుపుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు మృతి
పరిగి: లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన పరిగి పట్ట ణ పరిధిలోని బీజాపూర్ జాతీయ రహదారిపై బుధవారం చో టుచేసుకుంది. ఎస్ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం బుద్లాపూర్తండా(గోన్యనాయక్ తండా)కు చెందిన నేనావత్ రవికుమార్(27) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఉదయం ఇంటి నుంచి బైక్‌పై వికారాబాద్‌కు బయలుదేరాడు. మార్గమధ్యలో పరిగి మండలం గోవిందాపూర్ తండా గేట్ సమీపంలో పరిగి వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రవికుమార్ తల, ఇతర భాగాల కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్క డే మృతి చెందాడు. మృతుడి తండ్రి తుల్జారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మొయినాబాద్ రూరల్: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండల పరిధిలోని అమ్డాపూర్‌లో చోటుచేసుకుంది. మొయినాబాద్ సీఐ మల్లికార్జున్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కట్కూరి లక్ష్మయ్య కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి విహార యాత్రకు వెళ్లారు. ఇది గమనించిన దుండగులు సోమవారం తాళం పగులగొట్టి తులంన్నర బంగారు గొలుసు, వెండి పూజా సామగ్రిని ఎత్తుకెళ్లారు. చోరీ అనంతరం ఇల్లంతా కారంపొడి చల్లినట్లు తెలిపారు. అమ్డాపూర్ గ్రామంలో దొంగతనం చేసి, ఇలా మిర్చీ పౌడర్ చల్లడం రెండోసారి అని వెల్లడించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌కు దొరకకుండా దుండగులు గ్లౌజులు ధరించి దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. బాధితుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ఇబ్రహీంపట్నం రూరల్: సెల్‌ఫోన్ నొనివ్వడం లేదని మద్యం మత్తులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా, చింతల్, ఆర్ఎస్ఆర్ నగర్‌కు చెందిన గుడెల్లి రవికిరణ్ తల్లితో కలిసి మన్నెగూడ సమీపంలోని ఎన్ఎస్ఆర్ నగర్లో నివాసం ఉండేవాడు. తనకు సెల్ ఫోన్ కొనివ్వాలని నెల రోజులుగా తల్లితో గొడవ పడుతున్నాడు. నిత్యం మద్యం తాగి వచ్చి సెల్‌ఫోన్ కావాలని ఒత్తిడి చేస్తుండటంతో రెండు రోజుల్లో కొనిస్తానని తల్లి తెలిపింది. ఇదిలా ఉండగా సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రవికిరణ్ (27) ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా అస్పత్రికి తరలించారు.
ఇబ్రహీంపట్నం రూరల్: బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈసంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందిగామ మండలం, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన బిక్కి గోపీకృష్ణ (43), ఆదిభట్ల జీహెచ్ఎంసీ పరిధిలోని బొంగ్లూర్ గంగానగర్ కాలనీలో నివాసం ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మద్రాస్ ఫిల్టర్ కాఫీ షాపు వద్ద బైక్‌పై వెళ్లుండగా, అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


