ఎనిమిది మంది జూదరుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది జూదరుల అరెస్ట్‌

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

ఎనిమిది మంది జూదరుల అరెస్ట్‌ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్‌ మృతి

మంచాల: ఓ కోళ్ల ఫాంలో పేకాట ఆడుతున్న వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మంచాల సీఐ మధు కథనం ప్రకారం.. మంద బుచ్చిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద ఎనిమిది మంది పేకాట ఆడుతున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి రూ.5,790 స్వాధీనం చేసుకున్నారు.

రాజేంద్రనగర్‌: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన మేరకు.. బుధవారం తెల్లవారు జాము న 3.30 గంటలకు హైదర్‌ గూడ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో గుర్తు తెలియ ని మహిళ మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

డివైడర్‌ను ఢీకొని

యువకుడి మృతి

● ఎదుటి వాహనం లైట్లతో

దారి కనిపించక అదుపు తప్పిన బైక్‌

ఘట్‌కేసర్‌: ఎదుటి వాహనం లైట్ల కారణంగా దారి కనిపించక ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘట్‌కేసర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. హనుమకొండకు చెందిన బొప్పరాజు పవన్‌ తేజ (21) కూకట్‌పల్లిలో నివాసముంటు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం బంధువు ఉప్పల్‌కు చెందిన పోతరాజు అజయ్‌(23)కు చెందిన పల్సర్‌ బైక్‌ పై వెనక కూర్చొని కూకట్‌పల్లి నుండి ఇంటికి బయల్దేరాడు. రాత్రి ఘట్‌కేసర్‌ యంనంపేట్‌ చౌరస్తా వరంగల్‌ బస్‌ స్టాప్‌ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఎదురుగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఓ వాహనం లైట్లు నేరుగా కళ్లలో పడడంతో దారి సరిగా కనిపించక బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో పవన్‌ తేజ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. గాయాలైన అజయ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కుత్బుల్లాపూర్‌ : రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బ్లింకిట్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న మహాపత్తర్‌ జీవన్‌ కుమార్‌ (22) మంగళవారం సాయంత్రం గుండ్లపోచంపల్లి ఫ్లైఓవర్‌ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, అతని వెనకాల వస్తున్న మరో ద్విచక్రవాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో జీవన్‌ కుమార్‌ ముందుగా వెళ్తున్న లారీని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు శ్రీకర ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు మరణించినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో మరో మోటార్‌ సైకిల్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడగా, వారిలో అజీబుర్‌ అలీ పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement