అడవిలో జింకల వేట | - | Sakshi
Sakshi News home page

అడవిలో జింకల వేట

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

● తనిఖీల్లో తుపాకీ, బుల్లెట్లతో

పట్టుబడిన వేటగాళ్లు

● మలక్‌పేటలో కేసు నమోదు..

ముగ్గురి అరెస్ట్‌

మలక్‌పేట: అడవిలో జింకల వేటకు వెళ్లి వస్తున్న ముగ్గురు వ్యక్తులను మలక్‌పేట పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కందూరు వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు.. కొందరు వ్యక్తులు అడవి జంతువుల వేటకు వెళ్లి వస్తున్నారనే సమాచారంతో మలక్‌పేట పోలీసులు, చార్మినార్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా ఈనెల 19న సోమవారం సాయంత్రం మలక్‌పేట పీఎస్‌ పరిధిలోని రేస్‌కోర్సు రోడ్‌లో వాహనాలు తనిఖీలు చేపట్టారు. సయ్యద్‌ హుస్సేన్‌(47), సయ్యద్‌ ఒమర్‌(49), మహమ్మద్‌ హమీద్‌(40) ముగ్గురు స్కార్పియో వాహనంలో వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మలక్‌పేట సలీంనగర్‌ తీగలగూడ ప్రాంతానికి చెందిన వీరు ఈనెల 18 తేదీన కర్ణాటక రాష్ట్రం, కలబురిగి జిల్లా చిమ్మన్‌చోడ్‌ గ్రామ అటవీ ప్రాంతానికి వెళ్లారు. లైసన్స్‌ ఆయుధంతో అటవీ జంతువులను వేటాడేందుకు 12 రౌండ్లు కాల్చినట్లు పోలీసులు నిర్ధారించారు. జంతువులు దొరక్క పోవడం వల్ల 8 రౌండ్ల బుల్లెట్లు మిగిలినట్లు తెలిపారు. వారి నుంచి 30–60 స్పోర్టింగ్‌ రైఫిల్‌, నైట్‌విజన్‌ టెలిస్కోప్‌, 8 బుల్లెట్లు, సెల్‌ఫోన్లు, వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. జింకల వేటలో పాల్గొన్నట్లు నిందితులు వెల్లడించారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement