ఆటో ట్రాలీని ఢీకొన్న బైక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆటో ట్రాలీని ఢీకొన్న బైక్‌

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

శంషాబాద్‌ రూరల్‌: ఎదురుగా వస్తున్న ఆటో ట్రాలీని బైక్‌ ఢీకొన్న ఘటనలో తండ్రి మృతి చెందగా.. కూతురుకు గాయాలయ్యాయి. పెద్దషాపూర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. షాబాద్‌ మండలం మద్దూరుకు చెందిన మన్మరి రవి(38)కి భార్య, కూతురు దేవీ(10) ఉన్నారు. దసరా పండగ సందర్భంగా నారాయణగూడలో ఉండే రవి సోదరి వద్దకు దేవి వెళ్లింది. పండగ తరువాత రవి బుధవారం ఉదయం కూతురును తీసుకుని బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. శంషాబాద్‌–షాబాద్‌ రహదారిలో కాచారం శివారులో ఉన్న మూల మలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటో ట్రాలీని ఢీకొంది. ఈ ప్రమాదంలో రవికి తీవ్ర గాయాలుకాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దేవీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

తండ్రి మృతి, కూతురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement