శ్రీవారి ఆలయానికి గ్రంథం బహూకరణ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయానికి గ్రంథం బహూకరణ

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

సన్మానం

కొడంగల్‌: పట్టణంలోని శ్రీవారి ఆలయానికి బీజేపీ సీనియర్‌ నాయకుడు కరెంటు రాములు కుటుంబ సభ్యులు బుధవారం దివ్యవేద వాణి గ్రంథాన్ని బహూకరించారు. ఆలయంలో నిత్యం వేద పఠనం జరగాలని.. ఆ వాణిని ప్రజలకు వినించాలనే ఉద్దేశంతో గ్రంథం అందజేసినట్లు రాములు తెలిపారు. ఈ గ్రంథంలో నాలుగు వేదాలు ఉన్నట్లు చెప్పారు. రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం తెలుగు అనువాదం ఉన్నట్లు తెలిపారు. భగవంతుని సన్నిధిలో వేద పారాయణం జరగాలనే సంకల్పంతో గ్రంథం ఇచ్చినట్లు చెప్పా రు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ కోశాధికారి మురహరి వశిష్ట, బాల ప్రకాశ్‌, కేసీ వెంకటేశ్‌, భాగ్యలత, కొంతం సత్యనారాయణ, నందారం రత్నం, మధు, గోపాల్‌ పాల్గొన్నారు.

అమ్మవారి ముక్కుపుడక రూ.1,16,116

కుల్కచర్ల: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతకు అలంకరించిన ముక్కుపుడకను నీరటి సంజీవ్‌ కుటుంబీకులు రూ.1,16,116కు దక్కించుకున్నారు. మండల కేంద్రంలోని అంగడిబజార్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద నిమజ్జన ప్రక్రియలో భాగంగా మంగళవారం వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన సంజీవ్‌ ముక్కుపుడకను దక్కించుకున్నారు. ఆయన్ను ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానించారు.

వికారాబాద్‌ను

అభివృద్ధి చేస్తాం

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

అనంతగిరి: విజయదశమి సందర్భంగా వికారాబాద్‌ పట్టణంలోని అలంపల్లి బోనమ్మ గుడి వద్ద సీసీ రోడ్డును స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రారంభించారు. రూ.65 లక్షలతో నిర్మించిన రోడ్డును, హైమాస్ట్‌ లైట్లను స్థానిక కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో వికారాబాద్‌ పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అర్ధ సుధాకర్‌ రెడ్డి, మా జీ చైర్మన్‌ సత్యనారాయణ, మాజీ వైస్‌ చైర్మన్‌ చిగుర్లపల్లి రమేష్‌ కుమార్‌, కౌన్సిలర్లు లక్ష్మీకాంత్‌ రెడ్డి, రాఘవేందర్‌, వికారాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ చాపల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి, నాయకులు ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓటరుగా నమోదు

చేసుకోండి

అనంతగిరి: పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఆయన నివాసంలో జరిగిన ఉమ్మడి కుటుంబ ఆత్మీయ కలయికలో ఒకే కుటుంబానికి చెందిన 26మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ..నవంబర్‌ 6వ తేదీ వరకు ఓటరు న మోదుకు అవకాశం ఉన్నందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

షాద్‌నగర్‌: జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్షా ఫలితాల్లో సత్తాచాటి న్యాయమూర్తిగా ఎంపికై న షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ఆగీరు లక్ష్మీప్రసాద్‌ను బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. లక్ష్మీప్రసాద్‌ తల్లిదండ్రులు వెంకటేశ్‌, చంద్రకళలను శాలువా, పూల మాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బస్వం, వైస్‌ చైర్మన్‌ అందె మోహన్‌, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్‌, నాయకులు రవికుమార్‌గుప్త, కృష్ణ, గుట్ట రాజు, రాజు నాయక్‌, శ్రీశైలంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement