బస్సులో మహిళ గొలుసు చోరీ | - | Sakshi
Sakshi News home page

బస్సులో మహిళ గొలుసు చోరీ

Oct 21 2026 8:14 AM | Updated on Oct 21 2026 8:14 AM

తాండూరు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు చోరీకి గురైంది. ఈ ఘటన తాండూరు బస్టాండ్‌లో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉంటున్న శిరీష దసరా పండుగ కోసం పాత తాండూరులో ఉంటున్న తల్లి ఆండాలమ్మ ఇంటికి వచ్చింది. శిరీష భర్త సతీష్‌ ఫోన్‌ చేసి హైదరాబాద్‌కు రావాలని చెప్పాడు. దీంతో తల్లి ఆండాలమ్మతో కలిసి తాండూరు బస్టాండ్‌కు వచ్చింది. హైదరాబాద్‌ బస్సు రాగానే అందులో కూర్చున్నారు. బస్సు బయలుదేరి రాజీవ్‌ కాలనీ వద్దకు రాగానే మెడలోని బంగారు గొలుసు కనిపించలేదు. ఆందోళనకు గురై బస్సంతా వెతికారు. కనిపించకపోవడంతో బస్సు దిగి ఇంటికి వెళ్లి వెతికారు.. లాభం లేకపోవడంతో ఆర్టీసీ బస్టాండ్‌లో వెతికారు. అయినా కనిపించలేదు. వెంటనే తాండూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement